Namaste NRI

మలయాళంలో 15న…తెలుగులో త్వరలో

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించిన చిత్రం భ్రమయుగం. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం. ఈ మలయా ళ హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌ను నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ పతాకంపై చక్రవర్తి రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌ నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ వేడుక అబుదాబిలో నిర్వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ట్రైలర్‌ ను ఆవిష్కరించారు. చాలా కాలం తర్వాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో రూపొందిన ట్రైలర్‌ కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సినిమా కథ కేరళలో మాయాతంత్రంతో నిండిన యుగంలో నడుస్తుంది. ఒక గాయకుడి జీవితం లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనల నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మలయాళ వెర్షన్‌ 15న విడుదల కానుంది. త్వరలోనే మిగతా భాషల్లోనూ విడుదల చేస్తామని మేకర్స్‌ వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్‌ జలాల్‌, సంగీతం: క్రిస్టో జేవియర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events