నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 18 పేజెస్. సృజనాత్మక దర్శకుడు సుకుమార్ అందించిన కథతో రూపొందుతున్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ఇది. ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి కథ: సుకుమార్, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : శరణ్ రాపర్తి, అశోక్ బండ్రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: బాబు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.














