Skip to main content

Namaste NRI

ప్రపంచ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వినోద, పర్యాటక ప్రదేశాలపై దాడులు చేస్తామని ఇరాన్‌ తాజాగా హెచ్చరించింది. ఇప్పటికీ తాము క్షిపణులు తయారుచేస్తున్నామని ఇరాన్‌ స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించి మూడు వారాలు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు అగ్ర నాయకులను కోల్పోయి, భారీ స్థాయిలో ఆయుధాలు, ఇంధన పరిశ్రమలను నష్టపోయిన ఇరాన్‌ నుంచి శుక్రవారం మరోసారి హెచ్చరికలు జారీ అయ్యాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసంలో శుక్రవారం ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం కురిపించిన ఇరాన్‌ తన పొరుగు దేశాలైన గల్ఫ్‌లోని ఇంధన కేంద్రాలపై భీకర దాడులు కొనసాగించింది. నౌరుజ్‌గా పిలుచుకునే పర్షియన్‌ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవలసిన ఇరానియన్లు ఈ ఏడాది యుద్ధ బీభత్సంలో మునిగిపోయారు.

Social Share Spread Message

Latest News