Namaste NRI

18 పేజీస్ సినిమా రిలీజ్ డేట్స్ ఫిక్స్

నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన 18 పేజీస్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఒకవేళ ఓ ఫోన్‌ పుస్తకంతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? అయితే, 18న సిద్ధంగా ఉండండి అంటూ ఆ పోస్టర్‌కు ఓ వ్యాఖ్యను జత చేశారు. కొత్తదనం నిండిన ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. నిఖిల్‌, అనుపమల కెమిస్ట్రీ అందరినీ ఆకుట్టకుంటుంది. ఇద్దరూ మునుపెన్నడూ చూడని విధంగా విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది అని చిత్ర బృందం తెలియజేసింది. కుమారి 21 ఎఫ్‌ ఫేమ్‌ పల్నాటి సూర్య ప్రతాప్‌ ఈ చిత్రాన్నికి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం : గోపీసుందర్‌, సహ నిర్మాత : బాబు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events