Namaste NRI

కెనడాలో తాకా ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 2024 ఉగాది ఉత్సవాలు

తాకా (TACA- Telugu Alliances of Canada) తెలుగు అలయెన్సె స్ ఆఫ్ కెనడా ఆధ్వైర్యం  తేది 13 ఏప్రిల్ 2024 శనివార్ం రోజున కెనడాదేశంలోని టోరంటో పెవిలియన్ ఆడిటోరియంలో దాదాపు పదిహేనువందల మంది ప్రపవాస తెలుగు వాసులుసకుటంబ సపరివార్ సమేతంగా పాల్గొని ఉగాది పండుగ ఉతె వాలనుఅంగర్ంగ వైభవంగా జరుపుకున్నారు. తాకా అధ్య క్షులు శ్రీ రమేశ్‌ మునుకుంట్ల గారు  శ్రీ రమేశ్‌ మునుకుంట్ల గారు  ప్రారంభించగా  జనరల్‌ సెక్రెటరీ శ్రీ ప్రసన్న కుమార్‌ తిరుచిరాపల్లి  సభికులను ఆహ్వానించగా  శ్రీమతి ధనలక్ష్మి మునుకుంట్ల, శ్రీమతి సాధన పన్నీరు, శ్రీమతి వాణి జయంతి, శ్రీమతి అనిత సజ్జ మరియు శ్రీమతి సుకృతి బాసని గారల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

 కెనడా జాతీయగీతం ఆలాపనతో సాయంత్రము ఐదు గంటలకు ప్రారంభమైన సాంస్కృతిక  కార్యక్రమాలు దాదారు ఆరు గంటల పాటు నిరాఘాటంగా 150కి పైన స్థానిక తెలుగు కుటుంబాల కళాకారులతో కొనసాగాయి. ఉగాది పండుగ సందర్భంగా క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణం ప్రముఖ పురోహితులు శ్రీమంజునాథ్‌ గారు సభికులందరికీ రాశి ఫలాలు తెలియజేశారు. 2024 సంవత్సరపు తాకా ఉగాది పురస్కారాలను ప్రముఖ డా॥ జగన్‌ మోహన్‌  రెడ్డి గరిస,  ఒంటారియో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి దీపిక దామెర్ల మరియు కెనడాలో తెలుగు ప్రముఖులు శ్రీ లక్ష్మీ నారాయణ సూరపనేని గారలకు అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ ఉత్సవాలలో ప్రముఖ తెలంగాణ చిత్రకారులు  డా॥ కొండపల్లి శేషగిరి రావు గారి శతజయంతి ఉత్సవాల లో బాగంగా “An Odyssey of Life and Art Dr Kondapalli Seshagiri Rao” పుస్తకాన్ని వారి బందు మిత్రులు శ్రీ విజయరామారావు గారు మరియు శ్రీ సుబ్బారావు గారి సమక్షంలో ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ శ్రీ అరుణ్‌ కుమార్‌ లాయం గారు మరియు అధ్యక్షులు శ్రీ రమేశ్‌ మునుకుంట్ల గారు ఆవిష్కరించి డా॥ కొండపల్లి శేషగిరిరావు గారి జీవితం నేటి యువకులకు, విద్యార్థులకు ఆదర్శ ప్రాయమని తెలియజేశారు.

తాకా వ్యవహారిక కార్యక్రమములో అధ్యక్షులు శ్రీ రమేశ్‌ మునుకుంట్ల గారు మాట్లాడుతూ  తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ ముందు తరాలకు అందజేయుటకు తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ పాల్గొన వలసిన దిగా కోరారు. ఈ సందర్భంగా ఒంటారియో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీమతి దీపిక  దామెర్ల, డా॥జగన్‌ మోహన్‌ రెడ్డి గరిస,  సెక్రెటరీ శ్రీ ప్రసన్న కుమార్‌ తిరుచిరాపల్లి, ఫౌండెషన్‌ కమిటీ చైర్మన్‌ శ్రీ అరుణ్‌ కుమార్‌ లాయం సభికులనుద్దేశించి ప్రసంగించారు.

ఈ పండుగ సంబరాలలో తాకా వారు పదిహేను రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన రుచికరమైన తెలుగు భోజనం అందరూ ఆరగించి తాకా కమిటీ సభ్యుల కృషిని కొనియాడారు. అధ్యక్షులు శ్రీ రమేశ్‌ మునుకుంట్ల గారు మాట్లాడుతూ తాకా ఆశయాలను ముందుకు తీసుకువెల్లటం, తెలుగు జాతి కీర్తిని పెంచేందుకు తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి  తీసుకురావడం ముఖ్యం కాగా, అందుకోసం సహకరిస్తున్న గ్రాండ్‌ స్పాన్సర్‌ శ్రీరాం జిన్నాల గారికి, గోల్డు స్పాన్సర్లకు మరియు సిల్వర్‌ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఉగాది ఉత్సవాలలో అధ్యక్షులు శ్రీ రమేశ్‌ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు శ్రీ రాఘవ్‌ అల్లం, జనరల్‌ సెక్రెటరీ శ్రీ ప్రసన్న కుమార్‌ తిరుచిరాపల్లి, కోషాదికారి శ్రీ మల్లిఖార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి అనిత సజ్జ, డైరక్టర్లు కుమారి విద్య భవణం, శ్రీ ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి ఏలూరు, ఖజిల్‌ మొహమ్మద్‌, దుర్గా ఆదిత్య  వర్మ భూపతి రాజు, శ్రీ సాయి భోధ్‌ కట్టా, యూత్‌ డైరక్టరు శ్రీమతి లిఖిత యార్లగడ్డ, ఎక్స్‌ ఆఫిసియో సభ్యురాలు శ్రీమరి కల్పనమోటూరి, ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ శ్రీ అరుణ్‌ కుమార్‌ లాయం, ట్రస్టీబోర్డు చైర్మన్‌ శ్రీ సురేశ్‌ కూన, ట్రస్టీలు శ్రీమతి శృతి ఏలూరి, శ్రీమతి వాణి జయంతి, శ్రీ పవన్‌ బాసని మరియు ఫౌండర్లు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్‌ కుందూరి, మునాఫ్‌ అబ్దుల్‌ గారలు పాల్గొన్నారు. 

ఈ మొత్తం వేడుకలకు వ్యాఖ్యతలుగా శ్రీమరి అనిత సజ్జ, కుమారి విద్య భవణం, ఖజిల్‌ మొహమ్మద్‌ మరియు శ్రీమతి లిఖిత యార్లగడ్డ గారలు వ్యవహరించారు.  చివరగా కోషాధికారి శ్రీ మల్లిఖార్జునచారి పదిర గారు, ఉగాది పండుగకు సహకరించిన స్పాన్సర్లు, డిజిటల్‌ స్క్రీన్‌ టీం, డీజేటీం, డెకోరేషన్‌ టీం, ఫ్రంట్‌ డెస్క్‌ టీం, వాలంటీ ర్లు, ఫుడ్‌ టీం మరియు వలంటీర్లను సమన్వయ్య పరిచిన  శ్రీ రాజ్‌ సజ్జ, శ్రీ గిరిధర్‌ మోటూరి, శ్రీ రాజేశ్‌ చిట్టినే ని, టొరోంటో పెవిలియన్‌ యాజమాన్యానికి, ఆడియో వీడియో టీం లకు కృతజ్ఞతలు తెలుపుతూ వందన సమర్పణ చేశారు. అఖరుగా భారత జాతీయ  గీతాలాపనతో 2024 ఉగాది ఉత్సవాలు ముగిసాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events