Namaste NRI

అమెరికాలో ఆ పాడు పని చేసిన మహిళా టీచర్‌కు.. 30 ఏళ్ల జైలు శిక్ష

టీనేజ్ విద్యార్థితో శృంగారం చేసినందుకు ఓ మహిళా టీచర్‌కు జైలు శిక్ష పడిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన మెలిస్సా కర్టిస్  టీచ‌ర్‌  కు 30 ఏళ్ల జైలుశిక్ష ఖ‌రారైంది. కర్టిస్ టీనేజ్  విద్యార్థితో ప‌లుమార్లు శృంగారంలో పాల్గొన్న కేసులో ఈ శిక్ష‌ను విధించారు. మెలిసా క‌ర్టిస్ అనే 32 ఏళ్ల టీచ‌ర్‌కు థార్డ్ డిగ్రీ సెక్స్ అఫెన్స్ కింద శిక్ష వేశారు. శిక్షాకాలం పూర్తి అయిన త‌ర్వాత క‌ర్టిస్ కు మ‌రిన్ని ఆంక్ష‌లు విధించారు. కేవ‌లం త‌న పిల్ల‌లు త‌ప్ప మైన‌ర్ల‌కు ఆమెను దూరంగా పెట్టాల‌ని ఆదేశించారు. 8వ గ్రేడ్ విద్యార్థికి మ‌ద్యంతో పాటు మారిజోనా మ‌త్తుప‌దార్ధాన్ని ఇచ్చి,  ఆ కుర్రాడితో టీచ‌ర్ శృంగారంలో పాల్గొన్న‌ది. సుమారు 20 సార్లు ఆమె శృంగారంలో పాల్గొన్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. స్కూల్ టైం ముగిసిన త‌ర్వాత స్పెష‌ల్ క్లాసు పేరుతో ఇద్ద‌రు మాత్ర‌మే ఉండేవార‌ని ప్రాసిక్యూట‌ర్ తెలిపారు. అక్టోబ‌ర్ 2023లో ఈ కేసు విచార‌ణ మొద‌లైంది.

 2015లో ఓ ఎనిమిదో తరగతి విద్యార్థికి మద్యం, గంజాయి ఇచ్చి అతనితో లైంగిక సంబంధం పెట్టుకుంది. కేవలం తను ఒక్క సంవత్సరం మాత్రమే టీచర్‌గా పనిచేసింది. ఈ సమయంలోనే తన కంటే చిన్న వయస్సులో ఉన్నవారికి మభ్య పెట్టి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంది. ఒక 14 ఏళ్లు కుర్రాడితో ఎక్కువసార్లు శృంగారంలో పొల్గొందని గతేడాది ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అయితే ఈ ఘటనలో కోర్టు ఆమెకు కేవలం 12 నెలల జైలు శిక్ష మాత్రమే గతేడాది అమలు చేశారు. కానీ ఆమె ఇలా ఎంతో మంది మైనర్లతో క్లాస్‌రూమ్‌లోనే శృంగారం చేసిందని విచారణలో తేలడంతో ఆమెకు కోర్టు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆమె టీచర్‌గా కూడా పాఠాలు చెప్పకూడదని తెలిపింది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events