గూఢచారి కి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం జీ2. వినరు కుమార్ సిరిగినీడి దర్శకుడు. ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. 150 రోజుల పాటు, 6 దేశాల్లో షూటింగ్ చేసి, 23 భారీ సెట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జోనర్‌ని రీడిఫైన్ చేయనుంది అని మేకర్స్ తెలిపారు.అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. అడివి శేష్ హీరోగా మరో సరికొత్త మిషన్‌కి రెడీ అవుతున్న ఈ సినిమాకి గ్రాండ్ లెవెల్ పోస్టర్స్‌తో రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేయటం విశేషం.

ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్ ఉన్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీతో ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు తెరపై కనిపించబోతున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్‌అగర్వాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
















