నాటో కూటమి అవతరించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యూరప్, ఉత్తర అమెరికా అంతటా సామూహిక రక్షణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం మూడో సంవత్సరం లోకి ప్రవేశించినందున నాటో దేశాలు ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాయి. ఈ మేరకు బ్రసెల్స్‌లో కేకు కట్ చేసే వేడుకలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్, తోటి విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.1949 ఏప్రిల్ 4న నాటోదేశాల కూటమి ఏర్పడింది. వాషింగ్టన్‌లో ఈ కూటమి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. వాషింగ్టన్ లో వచ్చే జులై 9 నుంచి 11 వరకు నాటో సభ్య దేశాల నేతల సదస్సు జరుగుతుంది. నాటోలో స్వీడన్ 33 వ సభ్య దేశంగా గత నెల చేరడం వల్ల మొదటి మంత్రిత్వస్థాయి సమావేశానికి స్వీడన్ విదేశాంగ మంత్రి టొబియస్ బిల్‌స్ట్రామ్ అధ్యక్షత వహిస్తారు.