కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం డెవిల్. స్వీయ దర్శకనిర్మాణంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. గూఢచారి పాత్రలో ఆయన నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ 90 రకాల కాస్ట్యూమ్స్‌తో కనిపిస్తారని డిజైనర్ రాజేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ స్క్రిప్ట్ వివరించ గానే హీరో లుక్స్ డిఫరెంట్‌గా ఉండాలని అర్థమైంది. ఇందులో హీరో భారతీయుడు. అయినా బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన పాత్రను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాను. కొన్ని దుస్తుల్లో అచ్చమైన భారతీయత కనిపిస్తుంది అని తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా, నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా.
