Skip to main content

Namaste NRI

పెను విషాదం.. .. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌ దేశంలో

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పశ్చిమ ప్రాంతంలోని అబ్బా వ‌ద్ద ఓ బంగారు గ‌ని కూలిపోవ‌డంతో కనీసం 30 మంది గని కార్మికులు మృతి చెంద‌గా, మరికొందరు అందులో చిక్కుకుపోయారని అధికారులు, స్థానికులు తెలిపారు. గ‌నిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ముమ్మ‌ర చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాయి. అయితే వారు ప్రాణాలతో దొరికే అవకాశాలు చాలా త‌క్కువ‌ని ప్ర‌మాదంలో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిన ఫ్లోరియన్ గగుండే అనే కార్మికుడు తెలిపారు.

సహాయక బృందాలు, స్థానికుల‌తో కలిసి గంటల తరబడి శ్రమించి కూలిపోయిన గని నుండి 30 మృతదేహాలను వెలికితీశారని, గాయపడిన కార్మికులకు చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. బురదలో కూరుకుపోయిన‌ యువ‌తీ యువ‌కుల‌ మృత‌దేహాల‌తో ఆ ప్ర‌దేశ‌మంతా హృదయవిదారకంగా మారింది. స‌హాయం కోసం ప‌లువురు కోసం కేకలు వేయ‌డంతో ఆ ప్రాంత‌మంతా యుద్ధ‌భూమిని త‌ల‌పించింది. బాధిత‌కుటుంబాల‌ను ఆదుకుంటామ‌ని అధికారులు తెలిపారు. మధ్య ఆఫ్రికా గణ తంత్రంలో చిన్న తరహా గనుల తవ్వకంలో వేలాది మంది పనిచేస్తుంటారు. ఇక్కడ గనులు కూలిపోవడం సర్వసాధారణం. గని కార్మికులకు సాధారణంగా తగినంత రక్షణ ఉండ‌క‌పోవ‌డంతో త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events