
ఆంధ్రప్రదేశ్ గ్రీన్ బోర్డు చైర్మన్ గా ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన
సతీసమేతంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.పలువురు పార్టీ నాయకులు, అధికారులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చధనాన్ని పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 29 గ్రీనరీ మాత్రమే ఉందని దానిని 2047 నాటికి 50 శాతానికి పెంచడానికి కృషి చేయాలన్నారు. గ్రీన్ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.


















