Skip to main content

Namaste NRI

విజయదశమి కానుకగా రణబాలి

బ్రిటిష్‌ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న పీరియాడిక్‌ పాన్‌ ఇండియా చిత్రం రణబాలి. వివాహానంతరం అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్‌, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం విడుదల తేదీని గురువారం మేకర్స్‌ ప్రకటించారు.

విజయదశమి కానుకగా అక్టోబర్‌ 16న రణబాలి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విజయ్‌ దేవరకొండ చేతిలో కత్తితో ఫెరోషియస్‌గా కనిపిస్తున్నారు. ఆర్నాల్డ్‌ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: ప్రమోద్‌ తమ్మినేని, కెమెరా: నీరవ్‌ షా, జిష్ణు భట్టాచర్జీ, సంగీతం: అజయ్‌-అతుల్‌, సమర్పణ: గుల్షన్‌ కుమార్‌, భూషణ్‌ కుమార్‌, టీ సిరీస్‌ ఫిల్మ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events