Skip to main content

Namaste NRI

హైదరాబాద్ ఐటీ కారిడార్ రాయదుర్గం లోని భూమి ధర ఆల్ టైమ్ రికార్డ్ నమోదు.. ఎకరం రూ. 269 కోట్లు

హైదరాబాద్ రాయదుర్గంలో ఎకరం భూమి రూ.269 కోట్లు పలికింది. హైదరాబాద్​లోని ఐటీ కారిడార్‌ రాయదుర్గం భూమి ధర వేలంలో రికార్డులను తిరగరాసింది. గత వారంలో నమోదైన గరిష్ఠ ధర లెక్కలను తుడిచి పెట్టి ఇప్పుడు ఏకంగా ఎకరా రూ.269 కోట్ల ధర పలికింది. 5.38 ఎకరాల విస్తీర్ణం కల్గిన ప్లాట్‌ P2 వేలం వేయగా ప్రభుత్వానికి ఎకరాకురూ.269 కోట్ల చొప్పున మొత్తం రూ.1,447.22 కోట్ల ఆదాయం లభించింది.

హైదరాబాద్​కు చెందిన వంశీరాం బిల్డర్స్‌ సంస్థకే :తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) శుక్రవారం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలానికి వివిధ రియాల్టీ సంస్థల నుంచి ఊహించనంత స్పందన లభించింది. స్థానిక, జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు వేలంలో పోటీపడుతూ ఉత్సాహంతో పాల్గొన్నాయి. బ్రేగేడ్‌ సంస్థ చివరి వరకు పోటీ పడినా హైదరాబాద్‌కు చెందిన వంశీరాం బిల్డర్స్‌ అనే కంపెనీ ఎకరాకు రూ.269 కోట్లతో వేలంలో భూమిని సొంతం చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రిజర్వ్‌ చేసిన ధర కంటే 52.3 శాతం అధికం కావడం ఇక్కడ గమనార్హం.

గత వారం :ఇదే ప్రాంతంలో వారం క్రితం నిర్వహించిన ప్లాట్‌ పీ1 వేలంలో ఎకరం రూ.264 కోట్ల ధర పలికింది. 5.25 ఎకరాలకు గాను ప్రభుత్వానికి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. వేలం విలువలో 25 శాతాన్ని మొదటి విడతలో భాగంగా చెల్లింపుగా ఇప్పటికే ప్రభుత్వానికి సదరు సంస్థ జమ చేసిందని టీజీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం రాయదుర్గం భూములు ప్రభుత్వ ఖజానాకు బంగారు గనులుగా మారాయని రియల్​ ఎస్టేట్​ ప్రముఖులు అంటున్నారు. 2025, 2026లో టీజీఐఐసీ రాయదుర్గంలో 41.74 ఎకరాల భూమిని వేలం వేయగా ఏకంగా రూ.8,457.47 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీజీఐఐసీ చెబుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events