Skip to main content

Namaste NRI

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కత్తుల దాడిలో మృతి చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ (Times Square) వద్ద జరిగిన అకారణ కత్తిపోట్ల దాడిలో Bank of America Vice President ఎరిన్ పియాసెంటి (Erin Piacenti) మృతి చెందారు.క్వీన్స్ కు చెందిన 49 ఏళ్ల మహిళ బాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో వీరంగం సృష్టించింది.అక్కడే ఉన్న ఇద్దరిపై దాడికి పాల్పడింది ఈ ఘటన లో ఎరిన్ మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకి కూడా దూసుకెళ్లడంతో వారు కాల్పులు జరిపారు, దాంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది.ఈ దాడిలో మృతి చెందిన ఎరిన్ పియా సెంటి బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవలే ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు , ఐదు నెలలుగా ఆమె మాతృత్వపు సెలవుల్లో వుండి ఇటీవలే ఉద్యోగానికి తిరిగి వచ్చిన కొద్ది రోజులకే ఈ దారుణం జరిగింది.

Social Share Spread Message

Latest News