Skip to main content

Namaste NRI

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీకృష్ణదేవరాయగా కిచ్చా సుదీప్‌

కన్నడ అగ్ర నటుడు కిచ్చా సుదీప్‌ నటిస్తున్న పీరియాడిక్‌ చిత్రానికి దేవరాయ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో ఆయన విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయ పాత్రలో కనిపించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. శ్రీకృష్ణదేవరాయలు పాత్రలో సుదీప్‌ రాజసం ఉట్టిపడుతూ కనిపిస్తున్నారు.

చరిత్రను మలిచిన సామ్రాజ్యం. ఒక యుగాన్ని నిర్వచించిన రాజు. కాలాన్ని దాటి జీవించే ఓ లెజెండ్‌ అంటూ దేవరాయ పాత్రను పరిచయం చేశారు. అలనాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఆవిష్కరిస్తూ భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events