Skip to main content

Namaste NRI

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయమైన ప్రాణహిత–చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

డాక్టర్ వైఎస్సార్-డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు-2026 ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు.

భారతీయ వ్యవసాయం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాల్లో విశేష కృషి చేస్తున్న ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, వివేక్ వెంకటస్వామి, ఎంపీ జైరాం రమేష్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్, కేవీపీ ఫౌండేషన్ అధ్యక్షులు కేవీపీ రామచందర్ రావుతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వైఎస్సార్ ఆశయమైన ప్రాణహిత, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు.

నిరుపేదలు, రైతుల కష్టాలను తెలుసుకోవడానికి 2003లో ఎర్రటి ఎండలో ప్రజాప్రస్థానం పేరిట డాక్టర్‌ వైఎస్సార్‌ చేపట్టిన పాదయాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ, రైతుల ఆత్మగౌరవం పెంచడానికి ఉచితంగా కరెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అన్నారు.అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్‌ వైఎస్సార్ అని గుర్తుచేశారు. ఆనాడు రూ. 1300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేయడం, రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం వంటి చర్యలతో డాక్టర్‌ వైఎస్సార్‌ రైతుల గుండెల్లో రారాజుగా నిలిచారని పేర్కొన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ చివరి కోరిక నెరవేర్చడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజా పంపిణీ (PDS) విధానాన్ని విధానంలో
పేదవారికి బియ్యం, గోధుమలు, ఇతర వస్తువులను అందించారని, ఈరోజు తెలంగాణలో 3.40 కోట్ల మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం అందిస్తున్నామంటే ఆనాడు కాంగ్రెస్ ప్రారంభించిన పీడీఎస్ విధానం వల్లే సాధ్యమైందని ముఖ్యమంత్రి వివరించారు.

Social Share Spread Message

Latest News