Skip to main content

Namaste NRI

ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యం : సుమన్

శ్రీరామ్, స్వాతి మందాడి ప్రధాన జంటగా నటించిన తాజా చిత్రం మా రాముడు అందరివాడు. అనుముల ప్రొడక్షన్స్ మరియు శ్రీరామ్ క్రియేషన్స్ పతాకాలపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. యుద్ధనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదలకు ముస్తాబైంది.ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనుండగా, నిర్మాత అనుముల లక్ష్మణరావు వైల్డ్ విలన్‌గా విభిన్నమైన షేడ్స్‌లో అలరించనున్నారు. సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుక చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ శాశ్వతమని, హీరో శ్రీరామ్‌లో అద్భుతమైన నైపుణ్యం ఉందని కొనియాడారు. ఇందులో తాను ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తానని, సమాజానికి మంచి సందేశం ఇచ్చే పాత్ర ఇదని చెప్పారు. దర్శకుడు మైకిల్ ప్రతి విషయంలోనూ మంచి క్లారిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ట్విస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News