Skip to main content

Namaste NRI

జయహో రామానుజ రిలీజ్ ఎప్పుడంటే?

స్వీయ దర్శకత్వంలో డా॥ సాయివెంకట్‌ నటిస్తున్న చిత్రం జయహో రామానుజ. జోశర్మ కథానాయికగా నటిస్తున్నారు. అక్టోబర్‌ 25న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ఓ గీతాన్ని విడుదల చేశారు. సమసమాజం కోసం పాటుపడిన రామానుజాచార్యుల జీవితాన్ని ఈతరం వారికి తెలియజేసే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాతలు సాయిప్రసన్న, ప్రవళ్లిక తెలిపారు.

మనుషులంతా ఒక్కటే అంటూ సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొచ్చిన రామానుజాచార్యుల జీవితానికి వెండితెర దృశ్యరూపమిదని నటుడు, దర్శకుడు లయన్‌ సాయివెంకట్‌ పేర్కొన్నారు. సుమన్‌, ప్రవళ్లిక అశ్వాపురం తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సుదర్శనం ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లయన్‌ సాయి వెంకట్‌.

Social Share Spread Message

Latest News