Skip to main content

Namaste NRI

జెన్ జీ దెబ్బకు కుప్పకూలిన మరో ప్రభుత్వం

విద్యార్థి ఉద్యమానికి మరో ప్రభుత్వం కుప్పకూలింది. సెర్బియాలో జరిగిన తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో సంచలన రాజకీయ మార్పు చోటుచేసుకుంది. దేశాధ్యక్షుడు, రైట్‌ వింగ్‌ నేత అలెగ్జాండర్‌ వూసిచ్‌ తన ఓటమిని అంగీకరించడం తో, విద్యార్థి నాయకత్వంలోని స్టూడెంట్‌ లిస్ట్‌ ఉద్యమం విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజధాని బెల్గ్రేడ్‌తో పాటు పలు నగరాల్లో వేలాది యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఘనంగా సంబురాలు చేసుకున్నారు.కార్లపై తిరుగుతూ, గట్టిగా హారన్లు కొడుతూ, పాటలు పాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో స్టూడెంట్‌ లిస్ట్‌ సుమారు 2.2 మిలియన్ల ఓట్లను(52శాతం ఓటు షేరింగ్‌) సాధించి, పార్లమెంట్‌లో 135 నుంచి 140 సీట్లను కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలెగ్జాండర్‌ వూసిచ్‌కు చెందిన సెర్బియన్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ(ఎస్‌ఎన్‌ఎస్‌) సుమారు 1.7 మిలియన్ల ఓట్లను(32.3 శాతం) మాత్రమే సాధించి, దాదాపు 105 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం వూసిచ్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలను నమ్ముకుని, తాము ఓడిపోయామని బహిరంగంగా అంగీకరించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన స్టూడెంట్‌ లిస్ట్‌కు యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా అభినందనలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events