Skip to main content

Namaste NRI

నిజంగా ఇది తెలుగు సినిమాకు చాలా గొప్ప సంవత్సరం : విజయ్‌ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవిచైతన్య జంటగా నటించిన చిత్రం ఎపిక్‌- ఫస్ట్‌ సెమిస్టర్‌. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఆదిత్యహాసన్‌ దర్శకుడు. హైదరాబాద్‌లో చిత్ర ప్రీరిలీజ్‌ వేడుకకు విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రణబాలి షూటింగ్‌లో బిజీగా ఉన్నా. అందుకే విగ్‌ తీయకుండానే ఈవెంట్‌కు వచ్చాను. నిజంగా ఇది తెలుగు సినిమాకు చాలా గొప్ప సంవత్సరం. సినిమాలన్నీ వరుసగా సక్సెస్‌ అవుతున్నాయి. రాబోవు సినిమాలు కూడా 100 పర్సెంట్‌ స్ట్రైక్‌ రేట్‌తో రాబోతున్నాయి. తెలుగు సినిమాకు మోస్ట్‌ ఎక్సైటింగ్‌ ఫేజ్‌ ఇది అన్నారు. తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ సొంత పంథాను సృష్టించుకుంటున్నాడని, ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే కథ ఇదని, ఎపిక్‌ వాడి కెరీర్‌లో గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్న సినిమా ఇదని, కమర్షియల్‌ సినిమాల్లో ఓ ప్రయోగంలా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. నటుడిగా ఆరేళ్ల ప్రయాణంలో ఆనంద్‌ దేవరకొండ గొప్ప అభిరుచితో కథల్ని ఎంచుకుంటున్నాడని అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ప్రశంసించారు. మనలోని ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే కథ ఇదని హీరో ఆనంద్‌ దేవరకొండ పేర్కొన్నారు. నేటి యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించే సినిమా ఇదని దర్శకుడు ఆదిత్యహాసన్‌ చెప్పారు.ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News