Skip to main content

Namaste NRI

గ్రామీణ నేపథ్యంలో హారర్‌ మూవీ స్టార్ట్

దర్శకుడు శ్రీధర్‌ గాదె మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈశ్వర్‌ రాచిరాజు, నందు, లిఖిత ప్రధాన పాత్రధారులు. వెంకట్‌ తలారి నిర్మాత. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి క్లాప్‌ ఇచ్చి, దర్శక,నిర్మాతలకు స్క్రిప్ట్‌ని అందజేశారు. దర్శకుడు వీరభద్రంచౌదరి కెమెరా స్విచాన్‌ చేశారు.అతిథులందరూ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

విలేజ్‌ నేపథ్యంలో సాగే హారర్‌ సినిమా ఇదని, సరికొత్త కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కనున్నదని, సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్‌ తెలిపారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేశ్‌ గురు, రాయల్‌ శ్రీ, మట్టా శివకుమార్‌, విహా దీకొండ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: సాయికార్తీక్‌, నిర్మాణం: శ్రీఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌.

Social Share Spread Message

Latest News