Skip to main content

Namaste NRI

ప్రపంచ సుందరిగా జోహీర్రీ మోలా

డొమెనికన్‌ రిపబ్లిక్‌కు చెందిన జోహీర్రీ మోలా ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. వియత్నాంలోని న్హా ట్రాంగ్‌లో జరిగిన 73వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ 2026 గ్రాండ్‌ ఫినాలేలో జొహీర్రీ ప్రథమ స్థానంలో నిలిచి కిరీటాన్ని ఎగరేసుకుపోయారు.110 దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొన్న ఈ పోటీలో స్పెయిన్‌ భామ ఎలిజబెత్‌ రెయిన్స్‌ మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన తనుసియా శెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు.

2025లో మిస్‌వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్న థాయ్‌లాండ్‌కు చెందిన ఒపల్‌ సుచతా చువాంగ్‌ స్రీ, జొహీర్రీకి మిస్‌వరల్డ్‌ కిరీటం తొడిగారు. కాగా, ఈ పోటీల్లో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించిన మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీకి చెందిన నటి, మిస్‌ ఇండియా వరల్డ్‌ 2024 నికితా పోర్వల్‌ టాప్‌-40 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచారు.

Social Share Spread Message

Latest News