Skip to main content

Namaste NRI

అమెరికాలోని మిన్నియాపోలిస్‌లో తానా (TANA) ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ

TANA (తానా) ఏభై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అమెరికాలోని మినోటా రాష్ట్రం మిన్నియాపోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్లో 26 -27 విద్యా సంవత్సరం సందర్భంగా తానా నార్త్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ చేశారు. “Giving back to the community’’ అనే నినాదంతో అమెరికా తెలుగు సంఘం TANA (తానా) అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది విద్యార్థులకు తానా నార్త్ సెంట్రల్ రిప్రెసెంటేటివ్ రామ్ వంకిన, ప్రథినిధులు జయరాం నల్లమోతు, అశోక్ సుంకవల్లి, నాగ్ బొల్లు, RK అన్నే, వేదవ్యాస్ అర్వపల్లి, అజయ్ తాళ్లూరి, చంద్ర చెన్నుపాటి బ్యాక్ ప్యాక్స్ అందజేశారు.

అమెరికాలోని కమ్యూనిటీకి తమ వంతుగా సేవలందించాలన్న ఉద్దేశంతో తానా అధ్యక్షులు నరెన్ కొడాలి, ఉపాధ్యక్షులు శ్రినివాస్ లావు నాయకత్వంలో తానా ఈ బ్యాక్‌ ప్యాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తొందని తానా ప్రథినిధులు తెలిపారు. తానా నార్త్ సెంట్రల్ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచినందుకు తానా కమ్యూనిటీ సర్వీస్ కో-ఆర్డినేటర్ సాయి బొల్లినేని, కోశాధికారి రాజా కసుకుర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా బెతూన్ ఎలిమెంటరీ స్కూల్ నిర్వాహకులు, టీచర్లు మాట్లాడుతూ.. తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా బ్యాక్‌ ప్యాక్‌ కింద ఈ సంవత్సరం కూడా తమ స్కూల్‌‌ను ఎంపిక చేసుకు,ని పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌‌లను పంపిణీ చేసినందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events