Skip to main content

Namaste NRI

భారీ నైట్ యాక్షన్‌తో రెండో షెడ్యూల్ పూర్తి చేసిన రామ్

రామ్‌ పోతినేని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సైకలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ RAPO 23(వర్కింగ్‌ టైటిల్‌). రాపో సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్‌ కథానాయిక. తాజా షెడ్యూల్‌లో భాగంగా నెట్‌ ఎఫెక్ట్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ని తెరకెక్కించారు. కిలోమీటర్‌ మేర విస్తరించిన ఓ ప్రాంతాన్ని లైట్స్‌తో నింపి, ఓ అద్భుతమైన విజువల్‌ క్యాన్వాస్‌ని సృష్టించారు.

ఈ భారీ సెటప్‌కు సంబంధించిన ఫ్లైట్‌ వ్యూ చూస్తేనే సీక్వెన్స్‌ను ఎంత గ్రాండ్‌గా తీశారో అర్థమవుతుంది. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెవిన్‌ ఈ సీక్వెన్స్‌ని డిజైన్‌ చేయగా, డీవోపీ తిరునావుక్కరసు ఈ విజువల్స్‌ని చిత్రీకరించారు. దర్శకునిగా రామ్‌ పోతినేని విజన్‌ ఏంటో ఈ సీక్వెన్స్‌ తెలియజేస్తుందని చిత్రబృందం చెబుతున్నది. రెండో షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ పీఎస్‌, నిర్మాణం: రాపో సినిమాటిక్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events