Skip to main content

Namaste NRI

గ్రీన్ కార్డ్ ఇక మరింత ప్రియం.. ఇన్వెస్టర్ వీసా ఫీజుల రెట్టింపు!

ఈబీ-5 ఇమ్మిగ్రెంట్‌ ఇన్వెస్టర్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫీజులను అమెరికా ప్రభుత్వం భారీగా పెంచుతున్నది. దీనివల్ల పెట్టుబడి పెట్టి గ్రీన్‌కార్డ్‌ పొందాలనుకునే విదేశీయుల ఖర్చు పెరుగనున్నది. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఖరారు చేసిన కొత్త ఫీజుల విధానం నవంబర్‌ 30 నుంచి అమల్లోకి రానున్నది. స్వతంత్ర పెట్టుబడిదారులు ఉపయోగించే ఫామ్‌ ఐ-526 ఫీజు 3,675 అమెరికన్‌ డాలర్ల నుంచి 7,615 డాలర్లకు పెరుగనున్నది. రెండు ప్రారంభ పిటిషన్లకు 75 అమెరికన్‌ డాలర్ల టెక్నాలజీ ఫీజు కూడా ఉంటుంది. రీజినల్‌ సెంటర్‌ పెట్టుబడిదారులు ప్రత్యేకంగా ఇన్వెస్టర్‌ ఇంటెగ్రిటీ ఫీజు కూడా చెల్లించాలి. శాశ్వత నివాస హోదాపై ఉన్న షరతులను తొలగించేందుకు ఉపయోగించే ఫామ్‌ ఐ-829 ఫీజు కూడా 3,750 నుంచి 5,000 డాలర్లకు పెరుగనున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events