Skip to main content

Namaste NRI

ఉత్కంఠభరితంగా.. తత్వం : అర్జున్‌ కోలా

దినేష్‌తేజ్‌, దష్విక కె జంటగా నటించిన ఈ చిత్రం తత్వం. దర్శకుడు అర్జున్‌ కోలా. ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అర్జున్‌ కోలా విలేకరులతో ముచ్చటించారు. మర్డర్‌ మిస్టరీతో పాటు పాత్రల తాలూకు సైకాలజీని ఈ సినిమాలో చూపెట్టామని, అందుకే తత్వం అనే టైటిల్‌ను ఖరారు చేశామని అన్నారు. ఓ మర్డర్‌ మిస్టరీ వెనక నిజాలు, అబద్దాలు అన్నీ ఉంటాయి. వాటిని తెలుసుకునే క్రమంలో మనిషి తత్వం బయటపడుతుంది. కథానుగుణంగా మంచి టైటిల్‌ కుదిరింది అన్నారు.

ఈ సినిమా విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, హీరోహీరోయిన్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో షూటింగ్‌ ఆలస్యమైందని అర్జున్‌ కోలా తెలిపారు. తదుపరి చిత్రంగా గోదావరి నేపథ్యంలో ‘ద్వారపూడి డేస్‌’ తీయబోతున్నానని ఆయన పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events