రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ధర్మన్. రామ్ పోతినేని కూడా భాగమయ్యారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ధర్మన్ సినిమా మైసూర్ షెడ్యూల్‌కు సంబంధించిన పలు ఫొటోలను రాశీ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వాటిలో ఒక ఫొటోలో రజినీకాంత్, రాశీ ఖన్నాతో పాటు రామ్ పోతినేని కూడా కనిపించారు. అయితే ఆ ఫొటో కొద్దిసేపటికే సోషల్ మీడియా నుంచి తొలగించబడింది. కానీ అప్పటికే అభిమానులు ఆ ఫొటోను సేవ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఇప్పటివరకు రామ్ పోతినేని ధర్మన్ లో నటిస్తున్నారంటూ వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది.

ధర్మన్ లో రాశీ ఖన్నా కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. రజినీకాంత్‌కు జోడీగా ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ధర్మన్ తెరకెక్కుతోంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణం, ఆసక్తికరమైన కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.















