Skip to main content

Namaste NRI

గరివిడి లక్ష్మి నాకు దేవుడిచ్చిన వరం : ఆనంది

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం గరివిడి లక్ష్మి. టైటిల్‌ రోల్‌ని ఆనంది పోషించింది. గౌరినాయుడు జమ్ము దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. ఈసందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో అడివి శేష్‌, ప్రముఖ దర్శకులు బాబీ కొల్లి, హరీష్‌శంకర్‌, మారుతి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

మా అమ్మాయి కృతిప్రసాద్‌ సొంతంగా సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకొని మూడు కథలను సెలక్ట్‌ చేసుకున్నది. వాటిలో గరివిడి లక్ష్మి ఒకటి. టైటిల్‌ రోల్‌కు ఆనందిని ఎంపిక చేయడం గుడ్‌ ఛాయిస్‌. ఈ సినిమాపై కృతిప్రసాద్‌ వందశాతం ఫోకస్‌ పెట్టింది. నిర్మాతగా వందశాతం క్రెడిట్‌ తనదే. ఇకనుంచి మాసంస్థ నుంచి మంచి సినిమాలే వస్తాయి. అది గరివిడి లక్ష్మితో మొదలుకాబోతుంది అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ చెప్పారు.

గరివిడి లక్ష్మి పాత్ర తనకు దేవుడిచ్చిన వరమని, ఇది తనకు ప్రత్యేకమైన సినిమా అని, డైరెక్టర్‌ గౌరీనాయుడు సినిమాకు ఏం కావాలో అన్నీ నిజాయితీగా తీసుకున్నారని కథానాయిక ఆనంది తెలిపింది. షూటింగ్‌లో గరివిడి లక్ష్మిగా ఆనంది స్టేజ్‌ ఎక్కితే, తమకు పూనకాలు వచ్చేవని, ఈ సినిమాతో తను ఆడిస్తుంది, పాడిస్తుంది, అందర్నీ ఏడిపిస్తుందని డైరెక్టర్‌ గౌరీనాయుడు నమ్మకంగా చెప్పారు. ఇంకా కృతిప్రసాద్‌, నరేష్‌ వీకే, రాగ్‌ మయూర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events