Skip to main content

Namaste NRI

ఫ్రాన్సిస్‌ హాల్జెస్‌ను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం

విశ్వం ఎలా రూపాంతరం చెందిందనే విషయంపై కీలక ఆధారాలు అందిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్న అరుదైన న్యూట్రినో కణాల రహస్యాలను ఛేదించేందుకు చేసిన కృషికి బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్‌ హాల్జెస్‌కు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. న్యూట్రినోలు విద్యుత్తు ఆవేశం లేని, అత్యంత స్వల్ప ద్రవ్యరాశి కలిగిన సూక్ష్మమైన కాస్మిక్‌ కణాలు. అందువల్ల వాటిని గుర్తించడం చాలా కష్టం. విశ్వమంతటా అవి ఉన్నాయి. సూర్యుడి వంటి నక్షత్రాల నుంచి అవి వెలువడుతుంటాయి. ప్రతి సెకనుకు ట్రిలియన్ల కొద్దీ న్యూట్రినోలు మన శరీరాల గుండా కూడా ప్రయాణిస్తుంటాయి. ఈ రహస్యమైన భూత కణాలు (ఘోస్ట్‌ పార్టికల్స్‌) స్వయంగా కనిపించవు. అందువల్ల అవి ఇతర పదార్థ కణాలను ఢీకొన్నప్పుడు జరిగే పరిణామాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. న్యూట్రినోలు ఇతర కణాలను చాలా అరుదుగా మాత్రమే ఢీకొంటాయి. అందుకే వాటి ఢీకొనడాన్ని గుర్తించే అవకాశాలను పెంచేందుకు శాస్త్రవేత్తలు భారీ డిటెక్టర్లను నిర్మిస్తారు. అంటార్కిటికాలోని విస్తారమైన మంచును ఇలాంటి భారీ డిటెక్టర్‌గా ఉపయోగించాలనే ఆలోచనను హాల్జెస్‌ ప్రతిపాదించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events