Skip to main content

Namaste NRI

అనుపమా పరమేశ్వరన్‌ క్రేజీ కల్యాణం.. రిలీజ్‌ డేట్‌ ఇదే

అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్‌భాస్కర్‌, నరేష్‌ వీకే, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం క్రేజీ కల్యాణం. తెలంగాణ పెళ్లి నేపథ్యంలో కుటుంబ కథగా తెరకెక్కిస్తున్నారు. భద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగా ఈ నెల 30వ తేదీన కాకుండా రెండు వారాల ముందుగా, అంటే ఈ నెల 16న విడుదల చేయబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో నడిచే కథ ఇది. తెలంగాణలోని పెళ్లి జోష్‌ని ఆవిష్కరిస్తూ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ దూపాటి, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: భద్రప్ప గాజుల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events