Skip to main content

Namaste NRI

రుక్మిణి వసంత్‌తో శ్రీ కార్తిక్ కొత్త సినిమా.. తారగా పరిచయమైన బ్యూటీ!

శ్రీ కార్తీక్‌ దర్శకత్వంలో రుక్మిణి వసంత్‌ కథానాయికగా ఓ చిత్రం తెరకెక్కనున్నది. రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో కామేడీ డ్రామా ఇది. సిరుని సినీ కార్పొరేషన్‌, మ్యాడ్‌బాయ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ వీడియోను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో రుక్మిణి వసంత్‌ తారా అనే పాత్రలో నటిస్తున్నట్టు ఈ వీడియో ద్వారా పేర్కొన్నారు.

దర్శకుడు శ్రీకార్తీక్‌, నటులు దేవ్‌ రామనాథ్‌, వినాయక్‌ వైద్యనాథన్‌లు సరదాగా సంభాషించుకుంటూ తారగా రుక్మిణి వసంత్‌ను పరిచయం చేశారు. ఏడాదిన్నరగా సాగిన ఈ సినిమా ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ అనౌన్స్‌మెంట్‌ వీడియో సాగింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events