విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం మిస్టర్ దెయ్యం. సంజన అన్నే దర్శకత్వంలో వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో మంచు మనోజ్ క్లాప్ ఇవ్వగా, నటుడు అలీ కెమెరా స్విచాన్ చేశారు.

విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించారు. సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు విజయ్‌శంకర్, సిరి చౌదరి, నటులు ఖయ్యూమ్, పింగ్ పాంగ్ సూర్య ఆనందం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: బాబు కె.రావు, నిర్మాణం: అన్నే క్రియేషన్స్.















