Skip to main content

Namaste NRI

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన తెలుగు హీరో!

అమెరికా వేదికగా జరిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో తెలుగు మూలాలున్న యువ హీరో రాజ్ దాసిరెడ్డి తన ప్రత్యేక హైప్రొఫైల్ ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. కలలు, పట్టుదల, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆయన, ఈ ఫ్యాషన్ వేదికపై తన స్టైలిష్ లుక్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతంలో 2025లో ప్రతిష్టాత్మకమైన 97వ ఆస్కార్ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకుని అంతర్జాతీయ మీడియా ప్రశంసలు పొందిన రాజ్ దాసిరెడ్డి, ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఈవెంట్‌తో మరోసారి టాలీవుడ్‌లోనూ, గ్లోబల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారారు.

అమెరికాలలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రాజ్ దాసిరెడ్డి, అక్కడే ఫిల్మ్ మేకింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో రాణించి, అనంతరం నటనపై ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు చిత్రంతో ఆయన టాలీవుడ్‌లో హీరోగా అరంగేట్రం చేశారు. తన తొలి సినిమాతోనే మంచి నటనను కనబరిచి ప్రేక్షకుల మన్ననలను పొందారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events