Skip to main content

Namaste NRI

ఇడుపు కాయితం నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న చిత్రం ఇడుపు కాయితం. ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్‌ నిర్మాత. ఈ సినిమా నుంచి గడప అనే పాటను విడుదల చేశారు. అభినయ శ్రీనివాస్‌ రచించిన ఈ గీతానికి సురేష్‌ బొబ్బిలి సంగీతాన్నందించారు. తేలు విజయ ఆలపించారు. ఏ ఇంటి కోయిలవో నువ్వు మా ఇంటి కొచ్చి.. ప్రతి బంధాన్ని కూయాలే, నీ పట్టగొలుసుల సప్పుడు అందరికి శ్రీలత ఉన్నదనే కొత్త ధైర్యాన్ని ఇయ్యాలే అంటూ అత్తాగారింటి గడపలో అడుగుపెట్టే కొత్త కోడలికి ధైర్య వచనాల్ని చెబుతూ భావయుక్తంగా ఈ పాట సాగింది.

ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ ఈ పాటలో పుట్టింటి గడప దాటి మెట్టినింటిలో అడుగుపెట్టే ప్రతీ స్త్రీ జ్ఞాపకాలుంటాయి అని అన్నారు. ఈ పాట ప్రోమో విడుదల కాగానే తన నాన్న ఫోన్‌ చేసి బాగా నటించావు అని మెచ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని కథానాయిక నాగదుర్గ చెప్పింది. నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ దర్శకుడు కథ చెప్పినప్పుడు మన ఇంట్లో జరిగే కథలా అనిపించింది. కథలోని సహజత్వమే మా అందరిని ఆకట్టుకుంది అన్నారు. ఈ వేదిక మీద తెలంగాణ కళాకారులందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, ఏదో తెలియని ఉద్వేగం కలుగుతున్నదని దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి చెప్పారు. ఈ చిత్రం డిసెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events