Skip to main content

Namaste NRI

ఇజ్రాయెల్‌లో హంగ్ పార్లమెంట్ .. ఏ కూటమికీ దక్కని పూర్తి మెజారిటీ!

ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని రైట్‌ వింగ్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను సాధించలేకపోయింది. దీంతో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (నెసెట్‌)లో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 61 స్థానాలు అవసరం.

నెతన్యాహు కూటమికి 53 స్థానాలు రాగా, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు లభించాయి. అరబ్‌ పార్టీలకు కలిపి 19 స్థానాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటులో అవి కీలకంగా మారాయి. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ 27 స్థానాలతో పార్లమెంట్‌లో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే కూటమికి మెజారిటీకి మరో 8 స్థానాలు అవసరం. ప్రతిపక్షానికి మరో 13 స్థానాలు కావాలి. ఈ నేపథ్యంలో అరబ్‌ పార్టీల మద్దతు ఎవరి లభిస్తుందన్నది తదుపరి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే అంశంగా మారింది.

నెతన్యాహును అధికారానికి దూరం చేయాలనుకుంటున్న ప్రతిపక్షానికి అరబ్‌ పార్టీల మద్దతు కీలకం కానుంది. అయితే, వాటితో కలిసి పనిచేయడంపై ప్రతిపక్ష పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అరబ్‌ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా, లేక నెతన్యాహు వ్యతిరేక పార్టీలన్నీ కలసి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

ప్రతిపక్ష నేత ఐసెన్‌కోట్‌ అరబ్‌ పార్టీలతో కలిసి పనిచేసే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. షరతులతో కూడిన సహకారానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిచ్చారు. మరోవైపు అరబ్‌ పార్టీల నేతలు నెతన్యాహు వ్యతిరేక కూటమికి పార్లమెంట్‌ స్పీకర్‌ ఎంపికలో మద్దతిచ్చే అంశంపైనా చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోయినా, పార్లమెంట్‌ చర్చలు, చట్టాల రూపకల్పనపై ప్రభావం చూపే అవకాశం వాటికి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events