Skip to main content

Namaste NRI

రామాయణం నుంచి జనస్థాన్‌ రాజకుమారి శూర్పణఖగా.. రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం రామాయణ ఫ్రాంచైజీలోని తొలిభాగం నవంబర్‌ 5న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్‌ నటిస్తున్న ఈ పౌరాణిక ఇతిహాసం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దాదాపుగా నాలుగు వేల కోట్ల నిర్మాణ వ్యయంతో నమిత్‌ మల్హోత్రా రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ ఫ్రాంచైజీలో రావణుడిగా కన్నడ అగ్ర హీరో యశ్‌ నటిస్తుండగా, మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌, హనుమంతుడిగా సన్నిడియోల్‌, శూర్పణఖ పాత్రను రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పోషిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ న్యూలుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. బంగారు ఆభరణాలు ధరించి, రాజసం ఉట్టిపడే వస్ర్తాధారణతో రథంపై వస్తున్న రావణ సోదరి శూర్పణఖని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. వాల్మీకి రామాయణం శూర్పణఖను సౌందర్యరాశిగా పేర్కొన్నది. దానికి తగ్గట్టే శూర్పణఖగా రకుల్‌ ఈ పోస్టర్‌లో చాలా అందంగా కనిపిస్తున్నారు. ప్రముఖ పంపిణీ సంస్థ ఎస్‌వీసీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. ఈ సినిమాలోని రెండో పార్ట్‌ వచ్చే ఏడాది దీపావళికి రానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events