
శ్రీనివాస్ గవిరెడ్డి, విష్ణు ఓయి, మహేష్ దత్తా, శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఓరి నాయనో చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మణితేజ గొంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎస్.సాయిఅభిషేక్ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి వంశీ నందిపాటి క్లాప్‌నిచ్చారు. భావోద్వేగభరితంగా సాగే కథాంశమిది. నేటి యువత ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. వినోదానికి కూడా పెద్దపీట వేశాం అన్నారు. కేవలం 25రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని నిర్మాత సాయిఅభిషేక్ తెలిపారు. మైఖేల్ బెన్నీ, గాయత్రి చాగంటి, ఆర్నా ముల్లర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుభాష్నాథన్, రచన-దర్శకత్వం: మణితేజ గొంది.















