అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణులను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. రష్యాతో వార్‌లో ఆయుధాలు తగ్గడంతో ఉక్రెయిన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా పేట్రియాట్ మిస్సైళ్లను అమ్మేందుకు అమెరికా అంగీకరించడం ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. క్షిపణులు డెలివరీ అయ్యేందుకు చాలా ఏండ్లు పడుతుందని అన్నారు.

పీఏసీ-3 ఇంటర్సెప్టార్ క్షిపణలకు సుమారు రెండు బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని, అయితే ఉక్రెయిన్ కూటమి దేశాలైన యురోప్, కెనడాలో ఆ నిధులను ఇస్తాయని అమెరికా ప్రభుత్వం తెలిపింది. రష్యా రిలీజ్ చేస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే సమర్థవంతమైన ఆయుధం పేట్రియాట్ మిస్సైల్ ఒక్కటే అని జెలెన్స్కీ అన్నారు.















