జీవీ ప్రకాశ్‌కుమార్, గౌతమ్ వాసుదేవమీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న హారర్ థ్రిల్లర్‌కి 13 అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి వివేక్.కె దర్శకుడు. భవ్య త్రిఖ, ఆదిత్య కతిర్, ఐశ్వర్య, అధియా ప్రసాద్ ఇతర పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.

దట్టమైన అటవీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, వాస్తవ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం 13 సంఖ్యకు సంబంధించిన రహస్యాన్ని, దుష్టశక్తుల బారిన పడిన వ్యక్తుల పోరాటాన్ని ఆవిష్కరిస్తుందని, ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు వివేక్ తెలిపారు. డిసెంబర్లో సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధు కుమార్, కెమెరా: సీఎం మూవేందర్.















