Skip to main content

Namaste NRI

సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రం తీరంలోగల యాన్బూ లో ఘనంగా దసరా, బతుకమ్మ వేడుకలు

సౌదీ అరేబియాలోని మదీన రాష్ట్రంలోని యాన్బూ నగరం చమురు అనుబంధ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఎర్ర సముద్రం తీరంలో ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలకు నౌకాయాన మార్గం మధ్యలో ఇది ఉంది. ఇక్కడి వృత్తి నిపుణులయిన భారతీయులలో తెలుగు ప్రవాసీయులు అనేక మంది ఉన్నారు. వీరిలో అనేక మంది దసరా బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సౌదీలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు తమ ఆచారాలకు అనుగుణంగా ఆత్మీయ కలయికగా జరుపుకున్నాయి.

అక్కడి తెలుగు వారు తరాలు మారినా తెలుగును మరిచిపోలేదు, తెలుగు పండుగలను మరిచిపోలేదు. ఈ తరహాలో అనేక మంది కుటుంబ సమేతంగా వేడుకలలో ఉత్సాహంగా పాల్గొని పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశారు. యాన్బూ తరహా ప్రాంతంలో కూడా తెలుగు పండుగలు ఈ రకమైన వైభవంగా జరుగుతాయని ఊహించలేదని అక్కడి కి వెళ్ళిన ప్రముఖులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు

యాన్బూలోని తెలుగు ప్రవాసీ ప్రముఖులు కాశీరాజ్ కమ్మరి, రషీద్ ఖాన్, టాటా మాటూరి, రవి, ప్రకాష్, వేణు, రాము, విజయ్, అవినాష్, ప్రభాకర్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలలో స్త్రీ శక్తి పరమార్థంగా జరిగిన అమ్మవార్ల ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. దీన్ని చిన్నార్లు తనిష్క, మహిత కావేష్, ఉన్సి మాన్వి, రుత్విక, రమీజ్, లక్షిత, స్ఫూర్తి, జస్విత కృతిలు ప్రదర్శించగా కవిత కమ్మరి దర్శకత్వం వహించారు. బతుకమ్మలను కబడ సంప్రదాయ ఆటపాటలతో నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సౌదీలోని ప్రముఖ తెలుగు గాయకులు అంజద్, గోపిలు తమ మధుర పాటలతో సభికులను అలరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events