Skip to main content

Namaste NRI

నిజ జీవిత సంఘటనలతో రాబోతున్న ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ .. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

జీవీ ప్రకాశ్‌కుమార్‌, గౌతమ్‌ వాసుదేవమీనన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌కి 13 అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి వివేక్‌.కె దర్శకుడు. భవ్య త్రిఖ, ఆదిత్య కతిర్‌, ఐశ్వర్య, అధియా ప్రసాద్‌ ఇతర పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు.

దట్టమైన అటవీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, వాస్తవ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం 13 సంఖ్యకు సంబంధించిన రహస్యాన్ని, దుష్టశక్తుల బారిన పడిన వ్యక్తుల పోరాటాన్ని ఆవిష్కరిస్తుందని, ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు వివేక్‌ తెలిపారు. డిసెంబర్‌లో సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి సంగీతం: సిద్ధు కుమార్‌, కెమెరా: సీఎం మూవేందర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events