Skip to main content

Namaste NRI

ఆ రోజుని ఇప్పటికీ నేను మరిచిపోలేను : జాన్వీకపూర్‌

అత్యంత బిజీ బాలీవుడ్‌ కథానాయికల్లో జాన్వీకపూర్‌ ఒకరు. దేవర, పెద్ది సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం చేరువైన జాన్వీ, ప్రస్తుతం లగ్‌ జా గలే, రాకా సినిమాలతో బిజీగా ఉన్నారు. నిత్యం ఏదో ఒక మాధ్యమం ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు చేరువలో ఉండే జాన్వీ.. తాజా తన తల్లి, దివంగత నటి శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కథానాయికగా నా తొలి సినిమా ధడక్‌(2018). అయితే, ఆ సినిమాను ఒప్పుకునే ముందు ఇంట్లో చాలా పెద్ద డ్రామానే నడిచింది.

హీరోయిన్‌ని అవుతానని అమ్మకు చెప్పగానే ఒక్కసారిగా ఆమె షాకయ్యింది. అసలు నువ్వు కథానాయికగా సక్సెస్‌ కాగలవా? అంటూ సంకోచించింది కూడా. ఎందుకంటే నా విషయంలో అమ్మకు పెద్ద నమ్మకం ఉండేది కాదు. తాను ఎంతో సంఘర్షణకు లోనైంది. ఈ రంగంలోకి వస్తే నీ జీవితాన్ని పూర్తిగా దీనికే అంకితం చేయాలి అని సూటిగా నా కళ్లలోకి చూస్తూ చెప్పింది. ఆ రోజుని ఇప్పటికీ నేను మరిచిపోలేను అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events