Skip to main content

Namaste NRI

చైనా గూఢచారితో ఎన్విడియా సీఈవోకు వివాహేతర సంబంధం!

చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్‌ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉందని ఎన్విడియా సీఈవో జెన్సెన్‌ హువాంగ్‌ అంగీకరించారు. అలిస్‌ జెన్సన్‌తో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని ఆ తర్వాత సున్నితమైన సమాచారాన్ని చైనాకు బదిలీ చేసినట్టు వార్తా కథనాలు చెప్తున్నాయి. ఏఐ చిప్‌ల అతిపెద్ద సరఫరాదారు అయిన ఎన్విడియా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నది. అలిస్‌ ఒక చైనా జాతీయురాలు. సింగపూర్‌కు చెందిన డాటా సెంటర్‌ కంపెనీ మెగాస్పీడ్‌లో మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌. ఈ కంపెనీ ఎన్విడియా చిప్‌లతో పనిచేసే ఏఐ పరికరాలను కొనుగోలు చేసి చైనా దిగ్గజం అలీబాబాతో సహా పలు వ్యాపార సంస్థలకు కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని అద్దెకు ఇస్తుంది. చైనాకు ఎన్విడియా చిప్‌లను అక్రమంగా తరలించడంలో ఆమె సహాయపడిందనే అనుమానం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events