Skip to main content

Namaste NRI

ఆంక్షలను తప్పించుకొనేందుకు చైనా రహస్య ఆపరేషన్‌!

అధునాతన సెమీకండక్టర్‌, కృత్రిమ మేధ చిప్‌లను సమకూర్చుకోవడం, ప్రపంచ చిప్‌ పరిశ్రమపై సమాచారం సేకరించడాన్ని చైనా నిఘా సంస్థ పనిగా పెట్టుకున్నదని న్యూయార్క్‌ టైమ్స్‌(ఎన్‌వైటీ) నివేదిక తెలిపింది. పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా అమెరికా ఎగుమతి ఆంక్షలను తప్పించుకునేందుకు కనీసం రెండేండ్లుగా ఈ సంస్థ ఈ రహస్య ఆపరేషన్‌ నిర్వహిస్తున్నదని పేర్కొంది. ఈ ప్రయత్నాలకు నేతృత్వం వహించేందుకు చైనా భద్రత శాఖ అధిపతి చెన్‌ యిసిన్‌ ఆధ్వర్యంలో ఒక కార్య బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆసియా, అమెరికా, యూరప్‌లకు చెందిన ప్రస్తుత, మాజీ భద్రతా-నిఘా అధికారుల నివేదికను ఉటంకించింది.

అధునాతన చిప్‌లను చైనా కంపెనీలు కొనుగోలు చేయడం, దేశంలోకి అక్రమంగా తరలించడంలో తోడ్పడటంతో పాటు సెమీకండక్టర్‌ పరిశ్రమ, దాని సరఫరా వ్యవస్థలపై సమాచారం సేకరించడం ఈ ఆపరేషన్‌లో భాగమని వివరించింది. ఎన్విడియా మాజీ సీఈవో జెన్సన్‌ హువాంగ్‌పై నిఘా పెట్టేందుకు చైనా నిఘా సంస్థతో చైనా వ్యాపారవేత్త ఆలిస్‌ హువాంగ్‌ కలిసి పనిచేసినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events