Skip to main content

Namaste NRI

భారతీయులపై ట్రంప్‌ ప్రభుత్వం ఉక్కుపాదం .. 6 వేల మందికిపైగా

ఉద్యోగం కోసం, వీసా భద్రత కోసం, అమెరికాలోని సగటు భారతీయ టెకీ నిత్యం బతుకుపోరాటం చేస్తున్నాడు. నిరంతరం మారుతున్న నిబంధనలు, ఉద్యోగ కోతలు, గ్రీన్‌ కార్డు అనిశ్చితితో సతమతమవుతున్నాడు. ఉన్నత చదువును అభ్యసించినా చేతికి సంకెళ్లతో ఒక ఖైదీగా నిర్బంధ కేంద్రాల్లో మగ్గుతున్నాడు. వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మోపిన ఉక్కుపాదం కింద వేలాది మంది భారతీయులు నలిగిపోతున్నారు. ఏ క్షణం ఏమవుతుందో, ఎప్పుడు అరెస్ట్‌ చేసి డిపోర్టేషన్‌ కేంద్రాలకు తరలిస్తారో, తమను దేశం నుంచి పంపేస్తారో అన్న భయంతో వేలాది మంది బిక్కుబిక్కుమంటున్నారు.

2025 జనవరి నుంచి 2026 ఆగస్టు వరకు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) 6,111 మంది భారతీయులను అరెస్టు చేసింది. అమెరికాలో భారతీయుల అరెస్టులకు సంబంధించి నమోదైన అత్యధిక సంఖ్య ఇదేనని నివేదిక పేర్కొన్నది. అరెస్టయిన వారిలో 5,235 మందిని డిపోర్టేషన్‌ కేంద్రాల్లో ఉంచగా, 2,349 మందిని భారత్‌కు వెనక్కి పంపారు. ఈ నెలలో జరిగిన మధ్యంతర ఎన్నికలకు ముందే ఐసీఈ దాడులను పెంచింది. ఆసియా-పసిఫిక్‌ వర్గంలో అరెస్టులు, నిర్బంధాలు, దేశబహిష్కరణలకు గురైన వారిలో భారతీయులే తెలిసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events