Skip to main content

Namaste NRI

అమెరికా ఎయిర్‌పోర్టులో అమానుషం

అమెరికాలోని సియాటెల్‌ టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విమానం ఎక్కేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్న సమయంలో ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు రంగంలోకి దిగి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ తనకు, తన భర్తకు వర్క్‌ పర్మిట్‌ ఉందని చెప్పినా అధికారులు వారిని అదుపులోనికి తీసుకొన్నారు.దీంతో వారిని అరెస్ట్‌ చేయొద్దంటూ వారి కూతురు అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

మెక్సికోకు చెందిన రికార్డో లారోండో మెండోజా వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండటంతో అతడిని అరెస్టు చేసినట్లు ఐసీఈ తెలిపింది. మరో ప్రయాణికురాలు సోఫియా హెర్నాండెజ్‌ మెజియా అధికారులపై వేడి కాఫీని విసిరారని ఆరోపించింది. ఆమె వీసా గడువు కూడా దాటిందని, ఆమెపై ఫెడరల్‌ అధికారిపై దాడి చేశారనే కేసు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వాషింగ్టన్‌ గవర్నర్‌ బాబ్‌ ఫెర్గూసన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై అలాస్కా ఎయిర్‌లైన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events