అమెరికా, భారత్ మధ్య సంబంధాలు బలోపేతం కావడంలో బిపిన్ రావత్ పాత్ర కీలకమని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ఫ్రైస్ అన్నారు. భారత సీడీఎస్ బిపిన్ రావత్ మృతి పట్ల అమెరికా సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా నెడ్ ప్రైస్ మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఆయన దోహదపడ్డారు. జనరల్ బిపిన్ రావత్ కుటుంబానికి, ఈ ప్రమాదంలో మృతి చెందిన సైనిక సిబ్బంది కుటుంబాలకి, భారతీయులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)