Namaste NRI

వైష్ణవ్ తేజ్ బర్త్ డే స్పేషల్.. ప్రముఖ బ్యానర్ లో కొత్త సినిమా

మెగా మేనల్లుడు మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. తొలి చిత్రం ఉప్పెన తోనే ప్రేక్షకుల్ని మెప్పించిన యువ కథానాయకుడు వైష్టవ్‌తేజ్‌తో సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జనవరి 13 వైష్టవ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థలు అధికారికంగా ఓ వీడియో ద్వారా ఈ సినిమాని ప్రకటించాయి. వైష్టవ్‌తేజ్‌ మాస్‌ అవతారంతో ఈ చిత్రం రూపొందుతుందని, త్వరలోనే మరిన్ని వివరాల్ని అధికారికంగా ప్రకటిస్తామని  సినీ వర్గాలు తెలిపాయి.  అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందని తెలుస్తుంది. తాజాగా రిలీజ్‌  అయిన వీడియోలో  చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events