Skip to main content

Namaste NRI

అంతరిక్షంలోకి భారత సంతతి మహిళ

తొలిసారి అంతరిక్షంలోకి తెలుగమ్మాయి అడుగుపెట్టింది. వర్జిన్‌ గెలాక్టివ్‌ స్పేస్‌ టూర్‌ సక్సెస్‌ అయ్యింది.  రోదసిలోకి వెళ్లిన భారత సంతతి మూడో మహిళగా తాజాగా రికార్డు సృష్టించారు. ఆమే శిరీష  బండ్ల. ఆంద్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో శిరీష జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఆమె ఏరోనాటికల్‌ ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ సాధించారు. జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. శిరీష తొలుత నాసాలో వ్యోమగామి కావాలనుకున్నారు. కానీ అందుకు అవసరమైన స్థాయిలో కంటిచూపు ఆమెకు లేదని తేలింది. దీంతో తొలుత తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే ఓ ప్రొఫెస్‌ ఆమెకు.. కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌ల రంగంలో అవకాశాల గురించి చెప్పారు. అది శిరీషను బాగా ఆకర్షించింది. ఆ రంగానికి చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌లో చేరారు. ప్రస్తుతం అందులో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల  విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె వీఎస్‌ఎస్‌ యూనిట్‌ 22లో దూసుకెళ్లి తన అంతరిక్ష విహార కలను సాకారం చేసుకున్నారు.

                తాజాగా యాత్ర విజయవంతమవడంతో కల్పనా చావ్లా, సునీత విలియమ్స్‌ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి మూడో మహిళగా శిరీష రికార్డులోకి ఎక్కారు. మొత్తంగా చూస్తే భారత్‌ నుంచి రోదసిలోకి వెళ్లిన నాలుగో వ్యోమగామి ఈమె. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్‌ కంటే ముందే (1984) భారత పౌరుడు రాకేశ్‌ శర్మ అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events