Namaste NRI

రష్యాకు మరో ఎదురుదెబ్బ.. మరో సైనిక జనరల్‌ను

నెలలు గడిచిపోతున్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం ఒక కొలిక్కి రావడం లేదు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు మరో గట్టి దెబ్బ తగిలింది. రోమన్‌ కుతుజోవ్‌ అనే జనరల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. రోమన్‌తో కలుపుకుంటే ఇప్పటి వరకు 41 మంది జనరల్‌ స్థాయి సైనికాధికారులను రష్యా కోల్పోయింది. ఈ విషయాన్ని రెండు దేశాలు ధ్రువీకరించాయి. డోనెట్‌స్క్‌ ప్రాంతంలో ఆయన విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధంలో కనీసం 33 వేల మంది సైనికులను 41 మంది జనరల్‌ స్థాయి అధికారులను, పదుల సంఖ్యలో కల్నల్‌ స్థాయి అధికారులను రష్యా కోల్పోయిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events